VIDEO: గర్భిణుల్లో ఉమ్మనీరు పెరగాలంటే?
గర్భంలో శిశువు పెరుగుదలకు ఉమ్మనీరు కీలకమని గైనకాలజిస్టులు చెబుతున్నారు. 'ఉమ్మనీరు పెంచుకోవడానికి రోజూ 2-3లీ. ఎక్కువ నీరు తాగాలి. హై ప్రొటీన్ డైట్, నీటి శాతం అధికంగా ఉండే ఫుడ్ తినాలి. విశ్రాంతి తీసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. యూరినల్ ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తపడాలి. ఒకవైపునకు తిరిగి పడుకోవాలి' అని సూచిస్తున్నారు. * ప్రతి రోజూ ఉమెన్, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం వసుధ కేటగిరీలోకి వెళ్లండి. #🗞️అక్టోబర్ 3rd అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్
HYD: ఆ చిట్టి చేతులకు ఎన్ని కష్టాలో!
అమ్మ-నాన్న ఆలనా-పాలనలో హాయిగా ఉండే బాల్యం ఆ పసిబిడ్డకు దూరమైంది ఆ చిట్టి చేతులకు బాధలు, బాధ్యతలు బరువు అయ్యాయేమో. ఈ వీడియో చూస్తే గుండె తరుక్కుపోతోంది. IDPL చౌరస్తా వద్ద అంతా దసరా సంబరాల్లో మునిగారు. రోడ్డు పక్కనే ఓ చిన్నారి బొమ్మలను అమ్ముతూ కనిపించింది. కుటుంబ పోషణ కోసం ఈ బాధలు తప్పవని చెబుతోన్న ఆమె మాటలు స్థానికులను కలచివేశాయి. బడికి వెళ్లాల్సిన బాల్యం ఇలా మహానగర రోడ్ల మీదే మగ్గిపోవడం బాధాకరం. #🗞️అక్టోబర్ 3rd అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్
అందగత్తెలు ర్యాంప్వాక్ చేస్తుండగా భూకంపం
రెండు రోజుల క్రితం ఫిలిప్పీన్స్లో సంభవించిన భారీ భూకంపం 60 మందిని బలిగొన్న విషయం తెలిసిందే.
అయితే అదేరోజు ఫిలిప్పీన్స్లోని సెబులో 'మిస్ ఆసియా-పసిఫిక్ ఇంటర్నేషనల్-2025'లో పాల్గొన్న కంటెస్టెంట్లనూ భూప్రకంపనలు బెంబేలెత్తించాయి. ర్యాంప్వాక్ చేస్తుండగా ఒక్కసారిగా భూమి కంపించింది. ఏం జరుగుతుందో తెలియక అందగత్తెలు భయంతో పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. #🗞️అక్టోబర్ 2nd అప్‌డేట్స్💬 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం
తిలక్ వర్మది ఏపీనా? తెలంగాణా?.. క్లారిటీ ఇదే
టీమ్ ఇండియా యువ సంచలనం తిలక్ వర్మది ఏపీనా? తెలంగాణా? అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తిలక్ వర్మ దీనిపై క్లారిటీ ఇచ్చారు. 'నాన్నది మేడ్చల్. అమ్మది భీమవరం. నేను కూకట్పల్లిలో జన్మించాను. మా తాత ముత్తాతల నుంచి ఠాకూర్ అనే పేరు కంటిన్యూ అవుతోంది' అని పేర్కొన్నారు. తిలక్ వర్మ పూర్తి పేరు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ. ఈయన 2002 నవంబర్ 8న జన్మించారు. #🗞️అక్టోబర్ 1st అప్‌డేట్స్💬 #🗞️అక్టోబర్ 2nd అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్
రాంగ్ రూట్లో వెళ్తున్నారా.. ఈ వీడియో చూడండి!
'అదంతా ఎవడు తిరుగుతాడులే' అని చాలామంది బైకర్లు రాంగ్ రూట్లో వెళ్తుంటారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ అలవాటు మరీ ఎక్కువ అయితే బెంగళూరులో ఇలాగే 'అడ్డదారి'లో వెళ్లిన బైకరు యూటర్న్ తీసుకుంటున్న కారు ఢీకొట్టింది. దీంతో అతడు ఎగిరి కిందపడ్డాడు. ఇదంతా కారు డాష్క్యామ్లో రికార్డైంది. వీడియోను బట్టి బైకర్ స్వల్ప గాయాలతోనే బయటపడినట్లు కనిపిస్తున్నా.. ప్రమాదం జరిగిన తీరు మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. #📰సెప్టెంబర్ 30th అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్
రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తున్నారా?
TG: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ఒక వ్యక్తి రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్తే సరైన పత్రాలు చూపించాలి. లేదంటే నగదును సీజ్ చేస్తారు.
ప్రారంభించారు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు
తనిఖీల సమయంలో డాక్యుమెంట్స్ చూపలేకపోతే తర్వాత సమర్పించినా డబ్బును తిరిగిస్తారు. రూల్స్ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. #📰సెప్టెంబర్ 30th అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
స్లెడ్జింగ్తో రెచ్చగొడితే చుక్కలు చూపించాడు!
ఆసియాకప్ ఫైనల్లో పాక్పై తిలక్ వర్మ చెలరేగి ఆడటానికి ఆ దేశ కీపర్ మహ్మద్ హారిస్ స్లెడ్జ్ చేయడమూ ఓ కారణం. తిలక్ 3* రన్స్ వద్ద ఉన్నప్పుడు 'ఇది ముంబై కాదు.. IPL కాదు' అని అరుస్తూ హారిస్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించి 20/3 వద్ద ఉన్న టీన్ఇండియాను తిలక్ విజయతీరాలకు చేర్చారు.
స్లెడ్జింగ్ చేస్తే తెలుగోడి దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించారు #📰సెప్టెంబర్ 30th అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
#📰సెప్టెంబర్ 30th అప్‌డేట్స్ VIRAL: ఇలా ఉన్నారేంట్రా బాబు
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో స్కూటీపై ప్రమాదకరంగా వెక్తోన్న యువకుల వీడియో వైరలవుతోంది. నలుగురు స్కూటీపై కూర్చోగా వారి భుజాలపై మరో యువకుడు పడుకున్నాడు. ఇది గమనించిన మరో బైకర్ వీడియో తీస్తూ వారిని ప్రశ్నించారు. దీంతో అక్కడి నుంచి వారు జారుకున్నారు. దీనిపై పలువురు స్పందిస్తూ ఈ స్కూటీ 4 సీటర్ + 1 స్లీపర్ను కలిగిఉందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇలా చేసినవారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #👉నేరాలు - ఘోరాలు🚨 #📽ట్రెండింగ్ వీడియోస్📱
ట్రోఫీ లేకుండానే సెలబ్రేట్ చేసుకున్న టీమిండియా
టీమిండియా ప్లేయర్లు ఆసియాకప్ ట్రోఫీ లేకుండానే సెలబ్రేట్ చేసుకున్నారు. భారత జట్టు నిరాకరించడంతో ట్రోఫీని ACC & PCB ప్రెసిడెంట్ నఖ్వీ వెనక్కి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత భారత ఆటగాళ్లు పోడియం వద్దకు చేరుకుని కప్ లేకుండానే సెలబ్రేట్ చేసుకుంటూ ఫొటోలకు పోజులిచ్చారు. పాక్ ప్లేయర్లు రన్నరప్ చెక్, మెడల్స్ తీసుకోగా భారత ఆటగాళ్లు మెడల్స్ను కూడా నిరాకరించారు. #📰సెప్టెంబర్ 29th అప్‌డేట్స్📣 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
ఆసియా కప్ ఫైనల్లోనూ సేమ్ సీన్ రిపీట్
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లోనూ టాస్ టైమ్లో సేమ్ సీన్ రిపీటైంది. పాక్తో జరిగిన గత రెండు మ్యాచుల్లో సూర్య కుమార్ పాక్ కెప్టెన్ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా అలాగే అతడిని ఇగ్నోర్ చేశారు. అసలు అక్కడ ప్రత్యర్థి కెప్టెన్ ఉన్నాడనే విషయాన్నే గమనించనట్లుగా సూర్య కనిపించారు. ఈ మ్యాచ్కు ఫ్యాన్స్ నుంచి ఫుల్ సపోర్ట్ కనిపిస్తోంది. స్టేడియం మొత్తం టీమ్ ఇండియా అభిమానులతో నిండిపోయింది. #📰సెప్టెంబర్ 29th అప్‌డేట్స్📣 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్