ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కర్మ యోగి భీష్మాచార్యుడు భీష్మాష్టమి / భీష్మ ఏకాదశి /భీష్మ స్తుతి 🙏
15 Posts • 877 views
PSV APPARAO
575 views
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కర్మ యోగి భీష్మాచార్యుడు భీష్మాష్టమి / భీష్మ ఏకాదశి /భీష్మ స్తుతి 🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #🙏భీష్మాష్టమి శుభాకాంక్షలు #భీష్మాష్టమి శుభాకాంక్షలు *మానవాళికి మార్గదర్శి* *జనవరి 26 సోమవారం భీష్మాష్టమి సందర్భంగా* ... మాఘ శుక్ల సప్తమి మొదలు ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకా లుగా భావిస్తారు. భారత యుద్ధం సమ యంలో క్షతగాత్రుడై, దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్త రాయణం వచ్చే వరకూ, అంపశయ్యపై పరుండి ఉండి మాఘ శుక్ల సప్తమి నుండి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడనా డారని చెపుతారు. కాల నిర్ణయ చంద్రిక, నిర్ణయసింధు, ధర్మ సింధు, కాల మాధవీయం మున్నగు గ్రంథాలు మాఘ శుద్దాష్టమిని భీష్మ నిర్యాణ దీనంగా చెపుతున్నాయి. కార్తీక బహుళ అమావాస్యనాడు భారత యుద్ద ప్రారంభదినంగా భావించ బడుతుంది. కార్తీక మాసంలో రేవతీ నక్షత్రం నాడు శ్రీకృష్ణుడు, కౌరవుల వద్దకు రాయబారానికి పయనమై నట్లు భారతంలో ఉంది. "కార్తీక పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రం అవు తుంది. కృత్తికా నక్షత్రానికి మూడవ పూర్వపు నక్షత్రం రేవతి. ఆనాటి గణనలో రేవతీ నక్షత్రం శుద్ధ త్రయోదశి అవుతుంది. రాయ బారిగా వెళ్ళిన కృష్ణుడు హస్తినాపురంలో కొద్ది రోజులున్నాడు. వస్తూ కర్ణునితో మాట్లా డాడు. సదరు సంభాషణలో శ్రీకృష్ణుడు జ్యేష్ఠా నక్షత్రంతో కూడిన అమావాస్య నాడు యుద్ధం ప్రారంభం కాగలదని కర్ణునికి చెపు తాడు. భీష్ముడు అంపశయ్యపై యాభై ఎనిమిది రోజులున్నట్లు భారతంలో స్పష్టపరచ బడింది. భీష్మాచార్యులు యుద్ధం చేసింది పది రోజులు. భారత యుద్ధ ప్రారంభమైన కార్తీక బహుళ అమావాస్య నుండి 68రోజులు లెక్కిస్తే వచ్చేది మాఘ శుద్దాష్టమి. అదీగాక భారతయుద్ధ ప్రారంభంలో అర్జునుడు బంధు వధకు శంకిస్తాడు. ఆ సందర్భంలోనే శ్రీకృష్ణుడు, విజయునికి తత్త్వోపదేశం చేస్తాడు. ఆ ఉపదేశమే భగవ ద్గీత. ఈ ఉపదేశం యుద్ధం ప్రారంభదినాన జరిగింది. ఆ దినాననే గీతా జయంతి (భగవ ద్గీత పుట్టినదినం)గా జరపడం కొన్ని చోట్ల ఉంది. కనుక మాఘ శుక్లపక్ష అష్టమియే భీష్మ నిర్యాణ దినంగా భావిస్తారు. పద్మ పురాణంలో, హేమాద్రి వ్రత ఖండంలో భీష్మా ష్టమి గురించి చెప్పబడింది. భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుందని విశ్వాసం. ఈనాడు భీష్మునికి తర్పణం విడవాలని స్మృతి కౌస్తుభం తెలుపుతున్నది. కృత్యసార సముచ్చయాధారంగా భీష్మాష్టమి శ్రాద్ధదినం. భీష్మ ద్వాదశి వ్రతం ఈ దినాననే ప్రారంభిస్తా రని నిర్ణయసింధువు స్పష్టపరుస్తున్నది. భీష్మాష్టమి భారత దేశమంతటా జరుపుకోవా ల్సిన పర్వమని వ్రతోత్సవ చంద్రిక సూచిస్తు న్నది. కొందరు పంచాంగకర్తలు ఈనాటి వివర ణలో నందినీ పూజ, భీష్మాష్టమిగా పేర్కొం టారు. "వైయాఘ్రసద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ, అపుత్రాయ తదామ్యే తజ్జలం భీష్మాయవర్మణే, వసూ రామవతారాయ శంతనోరాత్మజాయచ, అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రాహ్మచా రిణే". అంటూ ఈదినం నాడు భీష్ములకు తర్పణం విడవాలని అమాదేర్ జ్యోతిషి పేర్కొంటున్నది. ఈనాడు తర్పణం, శ్రాద్ధం చేసిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని పురాణోక్తి. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
8 likes
10 shares
PSV APPARAO
604 views
#భీష్మ ఏకాదశి రోజున ఇలా తర్పణం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కర్మ యోగి భీష్మాచార్యుడు భీష్మాష్టమి / భీష్మ ఏకాదశి /భీష్మ స్తుతి 🙏 #నేడు భీష్మాష్టమి🙏🙏🙏🙏🙏🙏 #భీష్మాష్టమి ప్రత్యేకత ఏమిటి? సంతానం తప్పక కలుగుతుందా? భీష్మతర్పణ విధి - భీష్మాష్టమి: భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా సత్యధర్మములకు కట్టుబడి జీవించి చివర శ్రీకృష్ణుని సన్నిధిలో ముక్తినిబడసినవాడు, మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి కింద ఇచ్చిన శ్లోకములను చెప్పి ఇవ్వవలసి వుంటుంది. అలాగే తర్పయామి అని చెప్పినచోట్ల నీటితో భీష్మునికి తర్పణలు కూడా వదలవలసి ఉంటుంది. పితృ తర్పణాదులు తండ్రి లేని వారు చేయడం కద్దు, కానీ స్మృతికారులు ఒక్క భీష్ముని విషయంలో మాత్రం తర్పణ తండ్రి జీవించి ఉన్నవారుకూడా తర్పణలు చేయవలెనని నిర్దేశించారు. నరకచతుర్దశి, దీపావళి సమయంలో యమ తర్పణం ఎలాఐగే తండ్రి జీవించి వున్నవాళ్ళు కూడా చేస్తారో. అదే విధిన భీష్మ తర్పణం కూడా నిర్వహించాలి. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. శుక్లాష్టమ్యాం తు మాఘస్య దద్యాత్ భీష్మాయ యో జలమ్ ! సంవత్సరకృతం పాపం తత్‌క్షణా దేవనశ్యతి !! అని వ్యాసోక్తి నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!" తర్పణము 1. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! గంగాపుత్రవర్మాణం తర్పయామి !! (3 సార్లు) 2. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! భీష్మవర్మాణం తర్పయామి !! (3 సార్లు) 3. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! అపుత్రపుత్రవర్మాణం తర్పయామి !! (3 సార్లు) 1. భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః! ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!! (దోసిలితో నీరు విడువవలెను) 2. వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ! అపుత్రాయ దదామ్యేతత్ ఉదక భీష్మ వర్మణే!! (దోసిలితో నీరు విడువవలెను) 3. వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ! అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!! (దోసిలితో నీరు విడువవలెను) పునరాచమ్య ! సవ్యేన అర్ఘ్యం దద్యాత్ !! (తిరిగి ఆచమించి తూర్పుముఖంగా సవ్యముతో దేవతీర్థంగా అర్ఘ్యమీయాలి) 1. వసూనామవతారాయ అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను) 2. శంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను) 3. భీష్మాయ అర్ఘ్యం దదామి !!(దోసిలితో నీరు విడువవలెను) 4. ఆబాల్య బ్రహ్మచారిణే అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను) అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!! ఏకారణంచేతనైనా పై విధానంలో తర్పణలీయడం కుదరకపోతే, కనీసం ఈ క్రింది శ్లోకమ్ చెప్పి మూడు సార్లు దోసిలితో నీటిని వదలవలెను నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!" వైయాఘ్ర పద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ ! గంగా పుత్రాయ భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణే! అపుత్రాయ దదామ్యేతత్ ఉదకం భీష్మ వర్మణే! అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!! #namashivaya777 https://whatsapp.com/channel/0029Va4YUC6DeONFF8EDwQ2V
15 likes
9 shares
PSV APPARAO
646 views
#భీష్మాష్టమి ప్రత్యేకత ఏమిటి? సంతానం తప్పక కలుగుతుందా? #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కర్మ యోగి భీష్మాచార్యుడు భీష్మాష్టమి / భీష్మ ఏకాదశి /భీష్మ స్తుతి 🙏 #భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు *భీష్మాష్టమి* మాఘ శుక్ల అష్టమిని భీష్మాష్టమని పద్మ పురాణంలో వివరంగా చెప్పబడివున్నది. *'మాఘే మాసి సితాష్ట్యమాం సతిలం భీష్మతర్పణం* *శ్రాద్ధంచ యే నరాఃకుర్యుఃతేస్యుః సంతతి భాగినః* మాఘ శుద్ధ అష్టమినాడు నువ్వులతో భీష్మునికి తర్పణం వదిలి శ్రాద్ధము చేసిన వారికి సంతానము కలుగును. అదేవిధంగా వారికి ఆ సంవత్సరం చేసిన పాపం నశించును. మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మునకు తిల తర్పణం చేసి, అన్నదానం చేయవలెను. *వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ* *అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే* *వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ* *అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే* ఈ అర్ఘ్య తర్పణ మంత్రములతో శ్రాద్ధం చేసి అన్నదానం చేసినచో ఈప్సితార్థ(కోరుకున్నది) సిద్ది కలుగును. అనగా కోరుకున్నది సిద్ధించును. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
6 likes
13 shares