ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: మాస శివరాత్రి ... విశిష్టత పరమశివునికి ఇష్టమైన రోజు
45 Posts • 5K views
PSV APPARAO
696 views 2 days ago
#ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: మాస శివరాత్రి ... విశిష్టత పరమశివునికి ఇష్టమైన రోజు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శుభ కార్తీక మాసం 🪔🕉️🔱🪔శివకేశవుల పరమ పవిత్ర ఆధ్యాత్మిక మాసం 🙏🙏🙏 #శుభ కార్తీక మాసం - ఈ మాసంలో జరుపుకొనే పూజలు- నోములు - పండుగ లు *మాస శివరాత్రి* *ఈరోజు "మాస శివరాత్రి" ...* ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిధిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు. అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. శివుని జన్మ తిధిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి. *మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి ?* మహాశివుడు లయ కారకుడు. కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు , అమావాస్య ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. *చంద్రోమా మనస్సో జాతః* అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూపడము వలన జీర్ణ శక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. తద్వారా ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవడమో , చంచల స్వభావులుగా మారడమో , మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు , ఆరోగ్యం , ధనం , ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. అందుకే మనం గమనించవచ్చు .., అమావాస్య తిధి ముందు ఘడియాలలో కొందరి అనారోగ్యం మందగించండం లేదా తిరగబెట్టడం , ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణము ఇదే అని చెప్పవచ్చు. కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది. *మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి ?* ఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చెయ్యాలి. అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 5 , 11 , 18 , 21 , 56 , 108 ఇలా ప్రదక్షణములు చేయవచ్చు. అలాగే ఈ రోజు శివాలయములో పూజలో ఉంచిన చెరకు రసమును భక్తులకు పంచినచో వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనేవారికి అటువంటి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆరోజు ప్రదోష వేల శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది. ఇవేమీ చేయడానికి అవకాశము లేని వారు , ఆరోగ్యవంతులు , అలాగే గృహములో అశుచి దోషము లేని వారు ఈ రోజు ఉపవాసము ఉండి , మూడు పూటలా చల్లటి నీటితో వీలు అయినంత ఎక్కువ సమయం స్నానం చెయ్యాలి. మంచం మీద కాకుండా నేలపై పవళించాలి. *మాస శివరాత్రిని జరుపుకోవడము వలన ఉపయోగములు ?* ప్రత్యేకించి ఈ రోజు ను సశాస్త్రీయంగా జరుపుకోవడము వలన మన జాతకములోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది. సంతానలేమి సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది. వృత్తి అంశంలో ఉన్న ఆలస్యాలు , అవరోధాలు అంశంలో మార్పు కలుగుతుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మొండిగా , పెంకిగా , బద్దకంగా , మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈ రోజు ఉపవాసమును చేయించి దేవాలమునకు వెళ్ళే అలవాటును చేయించగల్గితే వారిలో కాలక్రమము లో ఖచ్చితముగా మార్పు వస్తుందని భావించవచ్చు. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. కావున మనం అందరం కూడా ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవడము ద్వారా శుభములను పొందవచ్చు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
8 likes
17 shares
PSV APPARAO
1K views 2 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: మాస శివరాత్రి ... విశిష్టత పరమశివునికి ఇష్టమైన రోజు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శుభ కార్తీక మాసం 🪔🕉️🔱🪔శివకేశవుల పరమ పవిత్ర ఆధ్యాత్మిక మాసం 🙏🙏🙏 #శుభ కార్తీక మాసం - ఈ మాసంలో జరుపుకొనే పూజలు- నోములు - పండుగ లు #ఇదే మాస శివరాత్రి విశిష్టత! *మాస శివరాత్రి* *ఈరోజు "మాస శివరాత్రి" ...* ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిధిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు. అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. శివుని జన్మ తిధిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి. *మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి ?* మహాశివుడు లయ కారకుడు. కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు , అమావాస్య ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. *చంద్రోమా మనస్సో జాతః* అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూపడము వలన జీర్ణ శక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. తద్వారా ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవడమో , చంచల స్వభావులుగా మారడమో , మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు , ఆరోగ్యం , ధనం , ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. అందుకే మనం గమనించవచ్చు .., అమావాస్య తిధి ముందు ఘడియాలలో కొందరి అనారోగ్యం మందగించండం లేదా తిరగబెట్టడం , ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణము ఇదే అని చెప్పవచ్చు. కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది. *మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి ?* ఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చెయ్యాలి. అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 5 , 11 , 18 , 21 , 56 , 108 ఇలా ప్రదక్షణములు చేయవచ్చు. అలాగే ఈ రోజు శివాలయములో పూజలో ఉంచిన చెరకు రసమును భక్తులకు పంచినచో వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనేవారికి అటువంటి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆరోజు ప్రదోష వేల శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది. ఇవేమీ చేయడానికి అవకాశము లేని వారు , ఆరోగ్యవంతులు , అలాగే గృహములో అశుచి దోషము లేని వారు ఈ రోజు ఉపవాసము ఉండి , మూడు పూటలా చల్లటి నీటితో వీలు అయినంత ఎక్కువ సమయం స్నానం చెయ్యాలి. మంచం మీద కాకుండా నేలపై పవళించాలి. *మాస శివరాత్రిని జరుపుకోవడము వలన ఉపయోగములు ?* ప్రత్యేకించి ఈ రోజు ను సశాస్త్రీయంగా జరుపుకోవడము వలన మన జాతకములోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది. సంతానలేమి సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది. వృత్తి అంశంలో ఉన్న ఆలస్యాలు , అవరోధాలు అంశంలో మార్పు కలుగుతుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మొండిగా , పెంకిగా , బద్దకంగా , మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈ రోజు ఉపవాసమును చేయించి దేవాలమునకు వెళ్ళే అలవాటును చేయించగల్గితే వారిలో కాలక్రమము లో ఖచ్చితముగా మార్పు వస్తుందని భావించవచ్చు. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. కావున మనం అందరం కూడా ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవడము ద్వారా శుభములను పొందవచ్చు. #namashivaya777
9 likes
23 shares
PSV APPARAO
629 views 3 months ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: మాస శివరాత్రి ... విశిష్టత పరమశివునికి ఇష్టమైన రోజు #శివారాధన 🔱 శివ పూజ విధి విధానాలు 🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #శివారాధన #ప్రదోషం - శివ పూజ ప్రదోష సమయంలో శివుడు అర్థనారీశ్వర రూపంలో ఆనంద తాండవ నృత్యం చేస్తాడని ప్రతీతి *🌼🌿 బిల్వాష్టకం - బిల్వ పూజ🌼🌿* *మాస శివరాత్రి సందర్భంగా డైలీ విష్ వీక్షకులకు ప్రత్యేకంగా...* శివ పూజకు అత్యంత శ్రేష్ఠమైనది మారేడు ఆకు. దీనినే సంస్కృతంలో బిల్వ పత్రం అంటారు. మారేడు చెట్టుకి వచ్చే ఆకులు విశేషమైన ఆకారం లో ఉంటాయి. మూడు ఆకులు ఒక సమూహంగా ఉంది కాబట్టి త్రిదళం అని పేరు పొందాయి . ఇది మూడు గుణాలకు ప్రతీకగా (సత్వ రజస్తమో గుణములు), పరమశివుని మూడు కన్నులుగా, మూడు జన్మల పాపాన్ని హరించేదిగా చెప్పబడింది. ఈ బిల్వపత్రాలు ఎండినా కూడా పూజలో వినియోగించ వచ్చు. మారేడు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. *ఈ బిల్వపత్రాల మహిమ గురించి రాసిన బిల్వాష్టకం తాత్పర్యం మీకోసం.* 🌿 త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం మూడు దళాలు కలిగిన, మూడు గుణాలకు ప్రతీకగా, మూడు కన్నులవలె, మూడు ఆయుధాలుగా, మూడు జన్మాల పాపాన్ని నాశనం చేసే ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం మూడు శాఖలు కలిగి, రంధ్రములు లేని, కోమలంగా, శుభము కలిగించే బిల్వపత్రంతో శివునికి పూజ చేస్తున్నాను. 🌿 అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే శుద్ధ్యంతి సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం ఛిద్రం కాని ఒక్క పత్రాన్ని నందికి సమర్పిస్తే సర్వ పాపాలను కడిగి వేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 సాలిగ్రామ శిలామేకాం విప్రాణాం జాతు చార్పయేత్ సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తే, సోమ యాగం చేస్తే వచ్చే ఫలాన్ని ఇచ్చే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 దంతికోటి సహస్రాణి వాజపేయ శతాని చ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం కోటి ఏనుగుల దానం ఫలం, నూరు యజ్ఞాల ఫలం, కోటి కన్యాదానాల ఫలం తో సమానమైన ఈ బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 లక్ష్మ్యాస్తనత ఉత్పన్నం మహాదేవస్య చ ప్రియం బిల్వవృక్షం ప్రయచ్ఛామి ఏకబిల్వం శివార్పణం లక్ష్మీ దేవీ స్తన్యము నుండి జన్మించిన, శివునికి ఎంతో ప్రియమైన, బిల్వ వృక్షం ఇచ్చిన దానితో సమానమైన బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం దర్శనం, స్పర్శనం వలన మహా పాపాలను నాశనం చేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనం ప్రయాగేమాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం కాశీ నివాసం, కాల భైరవుని దర్శనం, ప్రయాగలో మాధవుని చూసిన తర్వాత బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, కొసలో శివుని కలిగిన బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 ఫలశృతి బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ సర్వపాప వినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్ ఫలశృతి: శివుని సన్నిధిలో ఈ బిల్వాష్టకం పఠనం చేయటం వలన పాపాలు తొలగి, పుణ్యం కలిగి చివరకు శివలోక ప్రాప్తి కలుగుతుంది.. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
9 likes
14 shares
PSV APPARAO
961 views 3 months ago
#శివారాధన #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: మాస శివరాత్రి ... విశిష్టత పరమశివునికి ఇష్టమైన రోజు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శివారాధన 🔱 శివ పూజ విధి విధానాలు 🕉️🙏 మాస శివరాత్రి అంటే ఏమిటి........!! ప్రతి చంద్రమాసంలో (నభోమాసంలో) కృష్ణ పక్షం చతుర్దశి తిథి వచ్చే రోజును మాస శివరాత్రి అంటారు. సంవత్సరంలో ఇలా 12 శివరాత్రులు వస్తాయి. వీటిలో ఫాల్గుణ మాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ పర్వదినం శివునికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఈ రోజున శివుడు భక్తులకు చాలా దగ్గరగా ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ​మాస శివరాత్రి ప్రాముఖ్యత మరియు చేయవలసినవి........ ​ఈ రోజున భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తే పాపాలు నశిస్తాయి, పుణ్యం, ఆరోగ్యం, ఆయుష్షు మరియు శాంతి లభిస్తాయి. మహాశివరాత్రికి ముందు ప్రతి మాస శివరాత్రిని ఆచరిస్తే, శివానుగ్రహం మరింత బలంగా లభిస్తుందని నమ్మకం. ఈ పర్వదినాన చేయవలసిన కొన్ని ముఖ్యమైన క్రియలు: ​ఉపవాసం: ఈ రోజున ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేయడం ఉత్తమం. కేవలం పాలు లేదా పండ్లను మాత్రమే తీసుకోవచ్చు. ​రాత్రి జాగరణ: శివుని స్మరణతో రాత్రంతా మెలకువగా ఉండాలి. ఈ సమయంలో శివ నామస్మరణ, శివ భజన లేదా శివపురాణం పారాయణం చేయాలి. ​లింగాభిషేకం: శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి మరియు బిల్వదళాలతో అభిషేకం చేయాలి. ​జపం, ధ్యానం: "ఓం నమః శివాయ" మంత్రాన్ని నిరంతరం జపిస్తూ, శివుని జ్యోతిర్లింగ స్వరూపాన్ని ధ్యానించాలి. ​దానం: పేదలకు భోజనం లేదా వస్త్రాలను దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ​ఈ రోజు మనసులోని అహంకారం, కామం, క్రోధం వంటి అరషడ్వర్గాలను విడిచిపెట్టి, అంతా శివమయం అని భావించాలి. ​12 మాస శివరాత్రుల ప్రత్యేకతలు....... ​ప్రతి మాస శివరాత్రికి దానికంటూ ఒక ప్రత్యేక ఫలితం ఉంటుంది. ఇక్కడ వివరించిన విధంగా, ఒక్కో మాసంలో వచ్చే శివరాత్రి ఒక్కో ప్రయోజనాన్ని ఇస్తుంది: ​చైత్ర మాసం: విద్యాభివృద్ధి, బుద్ధి ప్రాప్తి. ​వైశాఖ మాసం: పాప పరిహారం, దీర్ఘాయుష్షు. ​జ్యేష్ఠ మాసం: ఆరోగ్యం, ధైర్యం. ​ఆషాఢ మాసం: ఆధ్యాత్మిక ప్రగతి, ధ్యాన శక్తి. ​శ్రావణ మాసం: కుటుంబ శాంతి, సుఖ సంపదలు. ​భాద్రపద మాసం: ధనప్రాప్తి, వృత్తిలో అభివృద్ధి. ​ఆశ్వయుజ మాసం: పుత్ర ప్రాప్తి, వంశవృద్ధి. ​కార్తీక మాసం: అజ్ఞానం తొలగి జ్ఞానం లభిస్తుంది. ​మార్గశిర మాసం: కోరికలు నెరవేరుతాయి. ​పుష్య మాసం: దైవ కృప, సద్గుణాలు. ​మాఘ మాసం: మోక్ష సాధనలో సహాయం. ​ఫాల్గుణ మాసం: పూర్వ జన్మ పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. ​ఈ క్రమంలో ప్రతి నెల శివారాధన చేయడం ద్వారా, జీవితం శాంతిమయంగా మారి, చివరికి మహాశివరాత్రి రోజున మోక్షం లభిస్తుందని నమ్ముతారు.
12 likes
12 shares